శంకర్‌కు నేతల ఘన నివాళి

ABN , First Publish Date - 2022-12-16T23:55:57+05:30 IST

కడ్తాల పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎర్రోళ్ల శంకర్‌ గురువారం ఆకస్మికంగా మృతి చెందగా ఆయన అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు.

శంకర్‌కు నేతల ఘన నివాళి
శంకర్‌ భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి

కడ్తాల్‌, డిసెంబర్‌ 16: కడ్తాల పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎర్రోళ్ల శంకర్‌ గురువారం ఆకస్మికంగా మృతి చెందగా ఆయన అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. అంతకు ముందు శంకర్‌ భౌతికకాయం వద్ద ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియలలో జడ్పీటీసీ దశర్‌థ్‌నాయక్‌, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ గంప వెంకటేశ్‌, మాజీ సర్పంచ్‌ వేణుగోపాల్‌, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:55:58+05:30 IST