ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీల ఫోరం నేతలు

ABN , First Publish Date - 2022-10-08T05:16:24+05:30 IST

ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీల ఫోరం నేతలు

ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీల ఫోరం నేతలు
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో కలిసి మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళుతున్న నాయకులు, ఎంపీటీసీల ఫోరం ప్రతినిధులు

  • ఎమ్మెల్సీ వర్గం నుంచి ఎమ్మెల్యే వర్గంలోకి జంప్‌

తాండూరు, అక్టోబరు 7 : ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గాజీపూర్‌ ఎంపీటీసీ వెంకటే్‌షచారి, పెద్దేముల్‌ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, ఆడ్కిచర్ల ఎంపీటీసీ ధన్‌సింగ్‌లు ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి వర్గంలోకి వెళ్లారు. ఎంపీటీసీలుగా ఎన్నికైనప్పటి నుంచి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గంలో ఉన్నవారు ఏనాడూ ఎమ్మెల్యేను కలవలేదు. శుక్రవారం ఎమ్మెల్యే వర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేతలతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియడంతోపాటు మునుగోడు ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేతో కలిసి బయల్దేరారు. ఇప్పటికే మండలంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గంలో ఉన్న సర్పంచ్‌ ఆడ్కిచర్ల సర్పంచ్‌ జనార్దన్‌రెడ్డి, కందనెల్లి సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, మన్‌సాన్‌పల్లి ఎంపీటీసీ రవి తదితరులు ఎమ్మెల్యే వర్గంలోకి వెళ్లిపోయారు. 

  • ఎమ్మెల్యేను కలిసిన టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి

తాండూరు రూరల్‌ : టీఆర్‌ఎస్‌ తాండూరు మండల ప్రధాన కార్యదర్శి రాకే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాకే్‌షగౌడ్‌ను ఎమ్మెల్యే రోహిత్‌ అభినందించారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో నాయకులు రఘు, నరేష్‌, శ్రీకాంత్‌ తదితరులున్నారు.


Read more