నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలి
ABN , First Publish Date - 2022-12-19T23:49:02+05:30 IST
నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు.
పూడూర్, డిసెంబరు 19 : నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చన్‌గోముల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా పార్టీ పటిష్టతకు ఆయన సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డి, పూడూర్ ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాలా ప్రభాకర్‌గుప్త, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజారుద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు అజీం, హరీశ్వర్‌రెడ్డి, ప్రవీణ్, రఘుతో పాటు మండలంలోని వివిధ గ్రామాల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.