ఆమనగల్లులో న్యాయవాదుల ఆందోళన
ABN , First Publish Date - 2022-10-18T05:18:26+05:30 IST
ఆమనగల్లులో న్యాయవాదుల ఆందోళన
- న్యాయవాదిపై పోలీసుల దురుసు ప్రవర్తన పట్ల నిరసన
- విధుల బహిష్కరణ.. కోర్టు ఆవరణలో ధర్నా
ఆమనగల్లు, అక్టోబరు 17: కల్వకుర్తి బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది సత్యనారాయణ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై న్యాయవాదులు మండిపడ్డారు. ఆమనగల్లు పట్టణంలో సోమవారం న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టుఆవరణలో ధర్నా నిర్వహించారు. న్యాయవాది ఆర్.సత్యనారాయణను ఉర్కొండపేట వద్ద పోలీసులు అక్రమంగా నిర్భందించి, దురుసుగా ప్రవర్తించి వేలిముద్రలు తీసుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాది పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిందం కృష్ణయ్య, న్యాయవాదులు లక్ష్మణ శర్మ, వెంకట్‌గౌడ్, యాదిలాల్, జమీల్ అహ్మద్, రమణ, భాస్కర్‌రెడ్డి, దుడ్డు ఆంజనేయులు, వెంకట్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శేఖర్, జయంత్ కుమార్, మల్లేశ్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, బిక్యనాయక్, తదితరులు పాల్గొన్నారు.