భూ సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-03-19T04:52:58+05:30 IST

భూ సమస్యలను పరిష్కరించాలి

భూ సమస్యలను పరిష్కరించాలి

 సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య 

కొడంగల్‌, మార్చి 18: భూసమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం కొడంగల్‌ మున్సిపాలిటిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారన్నారు. కానీ, నేడు అది చాలామందికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిలో కొత్తగా వచ్చిన ఆప్షన్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోందన్నారు. నిషేధిత జాబితాలోని  భూములను వెంటనే సరిచేయాలన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు దశలవారీగా సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ నెల 21న చేపట్టే కలెక్టరేట్‌ ముట్టడి విజయవంతం చేయాలని ఆయన కోరారు. 

Read more