కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2022-09-28T05:02:55+05:30 IST

కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు చిరస్మరణీయం

కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు చిరస్మరణీయం
షాద్‌నగర్‌: బాపూజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, చైర్మన్‌ నరేందర్‌

షాద్‌నగర్‌/ఆమనగల్లు/కందుకూరు/యాచారం/కొత్తూర్‌, సెప్టెంబరు 27: స్వాతంత్య్ర పోరాటంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ అందించిన సేవలు చిరస్మరణీయమని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు.  కొండా లక్ష్మణ్‌ బాపూజీ 107వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్‌ పట్టణ కూడలిలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజన్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అగ్గునూరి విశ్వం, పద్మశాలి సంఘం నాయకులు కోట జనార్దన్‌, ఒగ్గు కిషోర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లులోని మండల పరిషత్‌ కార్యాలయంలో, మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో  కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌ రెడ్డిలు లక్ష్మణ్‌బాపూజీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌, ఎంపీపీ అనితవిజయ్‌, ఎంపీడీవో వెంకట్రాములు, చేనేతసంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎంపీటీసీ కుమార్‌, నాయకులు జంగయ్య, సాయిలు, కృష్ణయ్య, బాలస్వామి, సతీష్‌, వెంకటయ్య, నిరంజన్‌గౌడ్‌, జయరామ్‌, విక్రమ్‌, సాయిలు, చంద్రునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరులో మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఎంపీపీ మంద జ్యోతి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డిలు లక్ష్మణ్‌బాపూజీకి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ జి.శమంత ప్రభాకర్‌, ఎస్‌.రాజశేఖర్‌, మల్లేష్‌, దామోదర్‌గౌడ్‌, కుమార్‌, పాండు, జి.ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా యాచారంలో ఎంపీపీ కొప్పు సుకన్య బాషా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బాషయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మధుసూధన్‌రెడ్డి లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. 

Read more