మరకత శివలింగాన్ని దర్శించుకున్న కేరళ ఐజీ

ABN , First Publish Date - 2022-07-08T04:57:24+05:30 IST

దైవచింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని

మరకత శివలింగాన్ని దర్శించుకున్న కేరళ ఐజీ
శివలింగానికి ప్రత్యక పూజలు చేస్తున్న ఐజీ లక్ష్మణ్‌నాయక్‌

శంకర్‌పల్లి, జూలై 7 : దైవచింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని కేరళ ఐజీ లక్ష్మణ్‌నాయక్‌ పేర్కొన్నారు. గురువారం శంకర్‌పల్లి మండలం చందిప్ప గ్రామంలోని మరకత శివలింగాన్ని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌నాయక్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలన్నారు. పూరాతనమైన శివలింగాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో వివంత డెవలపర్స్‌ యజమాని శ్రీనివా్‌సరావు, మహరాజ్‌పేట్‌ మాజీ ఉపసర్పంచ్‌ తొండ రవి, చందిప్ప సర్పంచ్‌ స్వప్న మోహన్‌, నాయకులు నర్సింహులు, ఆలయ చైర్మన్‌ సదానందం తదితరులు పాల్గొన్నారు.Read more