ముగిసిన కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2022-03-05T04:30:49+05:30 IST
ముగిసిన కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు
కీసర,ఫిబ్రవరి,4: అంగరంగవైభవంగా ఆరు రోజులు కీసరగుట్టపై జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ, ఈవో సుధాకర్‌రెడ్డి అధ్వర్యంలో ముగ్గింపు కార్యక్రమాలు నిర్వహించారు. ఫాల్గుణ శుద్ధవిదియ శుక్రవారం పురస్కరించుకొని స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఆనంతరం శాస్రోక్తంగా క్షేత్రదిగ్భలి చేశారు. ధ్వజారోహణం ద్వారా బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించి, వారిని సంతృప్తి పరిచి పూర్ణాహుతితో వీడ్కోలు పలికారు. కీసరగుట్ట వేదపాఠశాల పండితుడు గణపతిశర్మ, విద్యార్థులు, ఆలయ నిర్మాహకులకు సన్మానం చేశారు. అదేవిధంగా క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఉత్సవాల సందర్భంగా అన్నదానం చేసిన అర్యవైశ్య, వంశరాజ్, మున్నూరుకాపు, రెడ్డి, సంఘం సభ్యులను సన్మానించారు. కాగా పారిశుధ్య కార్మికులకు శుక్రవారం ఉడికిఉడకని భోజనం పెట్టడంతో ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న డీపీవో రమణమూర్తి కార్మికులకు క్షమాపణ చెప్పారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆయా ఽశాఖల ఉన్నత అధికారులు, ఫౌండర్ సభ్యులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, తహసీల్దార్ గౌరీ, సీఐ రఘువీర్‌రెడ్డి, ఎంపీడీవో పద్మావతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.