ప్రజలతోనే కేసీఆర్‌ రాక్షస పాలనకు అంతం

ABN , First Publish Date - 2022-10-07T05:44:15+05:30 IST

ప్రజలతోనే కేసీఆర్‌ రాక్షస పాలనకు అంతం

ప్రజలతోనే కేసీఆర్‌ రాక్షస పాలనకు అంతం
బోనం ఎత్తుకున్న విజయశాంతి

  • అవినీతితో రూ.కోట్లకు పడగలెత్తిన కేసీఆర్‌ కుటుంబం
  • బీజేపీ నాయకురాలు విజయశాంతి 
  • గుండ్లపోచంపల్లిలో అమ్మవారికి పూజలు

మేడ్చల్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో కేసీఆర్‌ రాక్షస పాలన అంతమొందించడం ప్రజల తోనే సాధ్యమని, కేసీఆర్‌ కుటుంబం అవినీతి పాలనతో కోట్లకు పడగలెత్తిందని బీజేపీ నాయకురాలు విజయశా ంతి విరుచుకుపడ్డారు. గురువారం రాత్రి మేడ్చల్‌ మండ లం గుండ్లపోచంపల్లిలో నెలకొల్పిన అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంత రం మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం సాధించుకున్న తెలంగాణలో..కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడుతూ అక్రమంగా సంపాదిస్తోందన్నారు. రూపాయికి గ తిలేని కేసీఆర్‌ నేడు కోట్లకు పడగలెత్తాడని, దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా సొంతంగా విమానం లేద ని, ఇది ప్రజలు ఆలోచించాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఏం చేయని కేసీఆర్‌.. దేశానికి ఏదో చేస్తానని చెప్తున్నాడ ని, త్వరలో ఆయన ఇంటికే పరిమితం కాకతప్పదన్నారు. అవినీతిరహిత పాలన కోసం బీజేపీని ఆదరించాలన్నా రు. బీజేపీ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read more