ఆత్మ రక్షణకు కరాటే దోహదం

ABN , First Publish Date - 2022-12-26T23:26:07+05:30 IST

ఆత్మ రక్షణకు కరాటే ఎంతో అవసరమని సినీ నటుడు సుమన్‌ తెలిపారు. పట్టణ శివారులోని ఓ పాఠశాలలో యాదవ్‌ బుడోకాన్‌ కరాటే క్లబ్‌ నిర్వాహకులు మల్లేష్‌ ఆధ్వర్యంలో సోమవారం బెల్ట్‌ల ప్రధానోత్సవం జరిగింది.

ఆత్మ రక్షణకు కరాటే దోహదం
కరాటే పోటీలను ప్రారంభిస్తున్న సినీనటుడు సుమన్‌

షాద్‌నగర్‌ రూరల్‌, డిసెంబరు 26: ఆత్మ రక్షణకు కరాటే ఎంతో అవసరమని సినీ నటుడు సుమన్‌ తెలిపారు. పట్టణ శివారులోని ఓ పాఠశాలలో యాదవ్‌ బుడోకాన్‌ కరాటే క్లబ్‌ నిర్వాహకులు మల్లేష్‌ ఆధ్వర్యంలో సోమవారం బెల్ట్‌ల ప్రధానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హజరైన సుమన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో విద్యార్థినులకు కరాటే శిక్షణ ఎంతో అవసరమన్నారు. తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌ హజరై మాట్లాడారు. అనంతరం విధ్యార్థులకు బెల్టులు ప్రదానం చేశారు.

Updated Date - 2022-12-26T23:26:08+05:30 IST