-
-
Home » Telangana » Rangareddy » Kadeddu died due to electrocution-MRGS-Telangana
-
విద్యుదాఘాతంతో కాడెద్దు మృత్యువాత
ABN , First Publish Date - 2022-07-19T05:27:23+05:30 IST
విద్యుదాఘాతంతో కాడెద్దు మృత్యువాత

షాద్‌నగర్ రూరల్, జూలై 18: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుదాఘాతంతో కాడెద్దు మృ త్యువాతపడింది. ఈ ఘటన ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి సురేష్ వ్యవసాయ పొలంలో కొంత కాలంగా విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులో వేలాడుతున్నాయి. వాటివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. సోమవారం ఉదయం మల్లే్‌షకు చెందిన ఎద్దు మేత మేస్తూ విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృత్యువాతపడింది. 15రోజుల కిందనే రూ.60వేలు పెట్టి కొనుగోలు చేసినట్లు బాధిత రైతు తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరాడు.