భూనిర్వాసితులకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2022-06-27T04:39:21+05:30 IST
చందన్‌వెళ్లిలో సర్వే నెంబర్ 190లో కంపెనీల కోసం
షాబాద్, జూన్ 26: చందన్‌వెళ్లిలో సర్వే నెంబర్ 190లో కంపెనీల కోసం సేకరించిన భూముల్లో అవకతవకలు జరిగాయని, బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని చందన్‌వెళ్లి రైతులు నీరటి అంజనేయులు ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని హైతాబాద్‌లోని వెల్‌స్పన్ కంపెనీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. చందన్‌వెళ్లి సర్వేనెంబర్ 190లో భూమిని కోల్పోయిన వారిలో ఇంకా కొందరి రైతులకు నష్టపరిహారం అందలేదన్నారు. వెంటనే పరిహారం అందేలా చూడాలన్నారు. చందన్‌వెళ్లి భూనిర్వాసితులకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు, భూనిర్వాసితులు ఉన్నారు.