మొయినాబాద్‌ పీఎస్‌ను సందర్శించిన జాయింట్‌ సీపీ

ABN , First Publish Date - 2022-12-20T23:45:47+05:30 IST

మొయునాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ను సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి మంగళవారం సందర్శించారు.

మొయినాబాద్‌ పీఎస్‌ను సందర్శించిన జాయింట్‌ సీపీ
మొయినాబాద్‌ పీఎస్‌లో జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి

మొయినాబాద్‌, డిసెంబరు 20: మొయునాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ను సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి మంగళవారం సందర్శించారు. స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించారు. కేసుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌హెచ్‌వోతో పాటు ఇక్కడి సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు ఇతర కేసులను త్వరగా ఛేదించాలని సూచించారు. రాత్రి సమయాల్లో దొంగతనాలు జరగకుండా గస్తీ పెంచడంతోపాటు అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయనతోపాటు శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-20T23:45:48+05:30 IST