పాఠకుల కోసం త్వరలో ‘జాబ్‌స్పేస్‌’ మొబైల్‌ యాప్‌

ABN , First Publish Date - 2022-09-25T05:49:42+05:30 IST

పాఠకుల కోసం త్వరలో ‘జాబ్‌స్పేస్‌’ మొబైల్‌ యాప్‌

పాఠకుల కోసం త్వరలో ‘జాబ్‌స్పేస్‌’ మొబైల్‌ యాప్‌
క్రొస్‌టాగ్‌ ప్రతినిధులతో మాట్లాడుతున్న పాండురంగారెడ్డి

  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 24: పాఠకుల కోసం కొత్త యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండు రంగారెడ్డి తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ‘జాబ్‌స్పేస్‌’ అనే మొబైల్‌ యాప్‌ తయారీకి సంబంధించి క్రొస్‌టాగ్‌ అనే సంస్థ ప్రతినిధులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంథాలయ సంస్థ సమాచారాన్ని కొత్త యాప్‌లో పొం దుపరుస్తామన్నారు. జిల్లాలోని గ్రంథాయలాలు, పుస్తకాలు, రోజూ వెలువడే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి తదితర వివరాలను ఈ యాప్‌లో పొందుపరుస్తామన్నారు. త్వరలోనే ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఆలోచన మేరకు మంత్రి సబితారెడ్డి ఆదేశాలతో ‘జాబ్‌స్పేస్‌’ యాప్‌ పాఠకులకు అతి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ శాఖ సిబ్బంది సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T05:49:42+05:30 IST