ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2022-09-24T05:43:10+05:30 IST

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎమ్మెల్యే యాదయ్యకు వినతిపత్రం అందజేస్తున్న సిబ్బంది

చేవెళ్ల, సెప్టెంబరు 23: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని శానిటేషన్‌ సిబ్బంది చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేను ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రభుత్వ ఆసుప్రతిలో ఇటీవల కొత్త కాంట్రాక్టర్‌ రావడంతో 18మంది సిబ్బందిలో కేవలం 12మంది మాత్రమే అవసరమని.. మిగతా 8మందిని తొలగించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆసుపత్రిలో పని చేస్తున్న 18 మంది సిబ్బంది ఏళ్లుగా పని చేస్తున్నామని తమను ఉద్యోగం నుంచి తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీఇచ్చారు. 

Read more