రేపు వికారాబాద్‌లో జాబ్‌మేళా

ABN , First Publish Date - 2022-12-15T23:03:19+05:30 IST

ఈ నెల 17న వికారాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో జాబ్‌మేళా నిర్వహిస్తామని జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి అబ్దుస్‌ సుభాన్‌ గురువారం తెలిపారు.

రేపు వికారాబాద్‌లో జాబ్‌మేళా

వికారాబాద్‌, డిసెంబరు 15: ఈ నెల 17న వికారాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో జాబ్‌మేళా నిర్వహిస్తామని జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి అబ్దుస్‌ సుభాన్‌ గురువారం తెలిపారు. విజయ బయో ఫర్టిలైజర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సేల్స్‌ రిప్రజెంటేటివ్‌లు పోస్టులున్నాయన్నారు. టెన్త్‌, ఆపై విద్యార్హతలున్న ఆసక్తి కలిగిన పురుషులు, మహిళలు జాబ్‌మేళాకు హాజరు కావొచ్చని, వివరాలకు నిర్వాహ కుల నెం:9676047444లో సంప్రదించాలని తెలిపారు.

Updated Date - 2022-12-15T23:03:20+05:30 IST