ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-11-20T00:10:03+05:30 IST
విద్యార్థినులు ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలని ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ అన్నారు.
ఇబ్రహీంపట్నం/కడ్తాల్/శంషాబాద్/కందుకూరు నవంబరు 19: విద్యార్థినులు ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలని ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి, స్త్రీశక్తి దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం వైష్ణవీ గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంధ్య, శ్రీరామ్, వంగ సంజీవరెడ్డి, శశిధర్‌రెడ్డి, సందీప్, వందన, సంతోష్, మహేందర్ పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ బాలికల కన్వీనర్ శశికళ, నాయకులు భరత్, నిఖిల్, దినేష్, శిరీష, రేణుక, వంశీ, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో ఝాన్సీలక్ష్మీబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ఝాన్సీలక్ష్మీబాయి వేషాధారణలో ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. అదేవిధంగా కందుకూరు మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తీగల భార్గవి, ఆర్యవైశ్య సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కుంచకూరి వెంకటేశ్వర్లు గుప్త, ఏబీవీపీ నగర కార్యదర్శి అనేగౌని సాయికిరణ్, నాయకులు మణికుమార్, శ్రీకాంత్, భరత్ పాల్గొన్నారు.