ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2022-10-12T05:00:19+05:30 IST

ప్రైవేట్‌ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు

ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 11 : ప్రైవేట్‌ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈనెల 14వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి జయశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకార ఆసుపత్రిలో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు 18-30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలని, నెలసరి వేతనం రూ.14 వేల నుంచి రూ.20వేల వరకు ఉంటుందన్నారు. అలాగే జియో ఫైబర్‌లో 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందులో పనిచేయడానికి వయసు 18-30 సంవత్సరాలు, పది, ఇంటర్‌, డిగ్రీ పాసై ఉండాలని చెప్పారు. వేతనం రూ.14 వేల నుంచి రూ.20 వేలతోపాటు ఇన్‌సెంటివ్‌ ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 14న ఉదయం 10 గంటలకు మల్లేపల్లిలోని ఐటీఐ క్యాంపస్‌ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9063099306, 9063858341 నెంబర్లను సంప్రదించాలని ఆమె తెలిపారు. Read more