ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2022-11-17T00:00:39+05:30 IST

వివిధ ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాల నియామకాల కోసం ఈనెల 18న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి జయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 16 : వివిధ ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాల నియామకాల కోసం ఈనెల 18న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి జయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. విప్రో, యాక్సిస్‌ బ్యాంకు, అమేజాన్‌, హెచ్‌జీఎస్‌, హెచ్‌ఆర్‌హెచ్‌ నెక్ట్‌, నవతా ట్రాన్స్‌పోర్టు సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఆపై చదివిన అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులు, ఉద్యోగాన్ని బట్టి రూ.15 వేల నుంచి 18 వేల వరకు నెలసరి జీతం ఉంటుందని తెలిపారు. ఈనెల 18 ఉదయం 10గంటలకు షాద్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పారు. వివరాల కోసం 8801742263, 9063099306 నంబర్లకు ఫోన్‌ చేయాలని కోరారు.

Updated Date - 2022-11-17T00:00:45+05:30 IST

Read more