క్రీడలతో అంతర్జాతీయ గుర్తింపు

ABN , First Publish Date - 2022-12-15T00:33:25+05:30 IST

క్రీడలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ బుయ్యాని మనోహర్‌రెడ్డి అన్నారు.

క్రీడలతో అంతర్జాతీయ గుర్తింపు
మంజులను సన్మానిస్తున్న డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి

డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి

దోమ, డిసెంబరు 14 : క్రీడలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ బుయ్యాని మనోహర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దొంగ ఎన్కెపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగిని మంజుల ఇటీవల మలేషియాలో నిర్వహించిన మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది. దీంతో బుధవారం ఆమెను మనోహర్‌రెడ్డి కులకచర్ల మండలం తిర్మలాపూర్‌లోని ఆయన నివాసంలో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భాగంగా మంజుల పరుగు పందెంలో బంగారు, వెండి పతకాలు సాధించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంజుల కుటుంబ సభ్యులు, నాయకులు రాఘవేందర్‌రెడ్డి, యాదయ్యగౌడ్‌, శివకుమార్‌గౌడ్‌, సంజుకుమార్‌, అంజయ్య, సాయిబాబా, వెంకటేశ్‌, హన్మంతు, నర్సిములు, కృష్ణ, రాంలాల్‌, మొగులయ్య, శివకుమార్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:33:26+05:30 IST