పంచాయతీ భవన నిర్మాణ పనులకు శ్రీకారం

ABN , First Publish Date - 2022-12-02T23:35:32+05:30 IST

ఖానాపర్‌ గ్రామంలో రూ.30లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

పంచాయతీ భవన నిర్మాణ పనులకు శ్రీకారం
పనులను ప్రారంభిస్తున్న సర్పంచ్‌ బొజ్జ వెంకట్రామ్‌ రెడ్డి

తలకొండపల్లి, డిసెంబరు 2: ఖానాపర్‌ గ్రామంలో రూ.30లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీ నిధులతో ఈ పనులకు శుక్రవారం ఎంపీటీసీ సరిత గణేశ్‌, ఉపసర్పంచ్‌ రవితో కలిసి స్థానిక సర్పంచ్‌ బొజ్జ వెంకట్రామ్‌రెడ్డి భూమిపూజ చేశారు. నాలుగు నెలల్లో పనులు పూర్తిచేసి భవనాన్ని వినియోగంలోకి తెస్తామని సర్పంచ్‌ తెలిపారు. ఖానాపూర్‌ గ్రామాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈఈ తిరుపతిరెడ్డి, ఏఈ విద్యాసాగర్‌, పంచాయతీ కార్యదర్శి అలివేలు, వార్డుసభ్యులు, నాయకులు కర్ణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌, బిక్షమయ్యగౌడ్‌, రామన్‌గౌడ్‌, శంకర్‌, నర్సింహ, యాదయ్య, ఈదమయ్య, వెంకటేశ్‌, రఘురామ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T23:35:33+05:30 IST