దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు దారుణం

ABN , First Publish Date - 2022-12-31T00:04:15+05:30 IST

: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరే్‌షను తక్షణమే అరెస్టు చేయాలని

దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు దారుణం
షాద్‌నగర్‌ : పోలీస్‌స్టేషన్‌ ఎదుట స్వాములు ధర్నా

బైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల డిమాండ్‌

చేవెళ్ల/ శంకర్‌పల్లి/ మొయినాబాద్‌/ఆమనగల్లు/ యాచారం / షాద్‌నగర్‌/ కేశంపేట/ ఇబ్రహీంపట్నం, డిసెంబరు 30 : హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరే్‌షను తక్షణమే అరెస్టు చేయాలని చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాల బీజేపీ, అయ్యప్ప సేవా సమితి, హిందూ సంఘాల సభ్యులు డిమాండ్‌ చేశారు. వారు భారీ ర్యాలీలు తీశారు. అదేవిధంగా ఆమనగల్లులో బైరి నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ అయ్యప్ప సేవాసమాజం, భజరంగ్‌దల్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే యాచారం మండలంలోని అయ్యప్పస్వాములు అయ్యప్పస్వామిని బైరి నరే్‌షపై పోలీ్‌సస్టేషన్‌లో వినతిపత్రం అందించారు. అలాగే షాద్‌నగర్‌ నియోజకవర్గ అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట అయ్యప్ప స్వాములు ధర్నా నిర్వహించారు. అయ్యప్ప స్వామి జననం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను కించపరిచిన బైరి నరే్‌షపై పీడీ యాక్టు పెట్టాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ముల్తూంకర్‌ శివాజీ, కేశంపేట అయ్యప్ప సేవ సమితి సభ్యులు కేశంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా అయ్యప్ప భక్తులు, బీజేపీ నాయకులు ఇబ్రహీంపట్నంలో రాస్తారోకో చేశారు. అనంతరం అతనిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమాల్లో చందర్‌ నాయర్‌, నాయిని సత్యనారాయణ, బర్ల జగదీశ్వర్‌యాదవ్‌, జక్క రవీందర్‌రెడ్డి, జంగయ్య ఏ.అనంత్‌రెడ్డి, శంకరమ్మ, నరోత్తంరెడ్డి, జంగయ్య, కృష్ణ, మల్లేశ్‌, శివశక్తిసాయికుమార్‌, మోహన్‌, శ్రీను, బీజేపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు కొప్పు బాష, సర్పంచ్‌ ఎం.శ్రీధర్‌రెడ్డి, శేఖర్‌, రావి, రఘవేందర్‌, సురేష్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సంతోష్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:04:16+05:30 IST