‘ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల వాణిని వినిపిస్తా’
ABN , First Publish Date - 2022-12-15T00:10:19+05:30 IST
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్య ఓటువేసి గెలిపిస్తే మండలిలో టీచర్ల సమస్యలపై మాట్లాడుతానని పీఆర్టీయూ టీఎస్ అఽభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి అన్నారు.
ఆమనగల్లు, డిసెంబరు14: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్య ఓటువేసి గెలిపిస్తే మండలిలో టీచర్ల సమస్యలపై మాట్లాడుతానని పీఆర్టీయూ టీఎస్ అఽభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి అన్నారు. ఆమనగల్లులోని జడ్పీ బాలుర, బాలికల, బస్టాండ్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల్లో బుధవారం ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి, ప్రమోషన్లు, బదిలీలు, ఆరోగ్య కార్డులు, వంటి సమస్యల పరి ష్కారానికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు మండల అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి చందర్, తలకొండపల్లి మండల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, నాయకులు అరవింద్, వెంకట్‌రాంరెడ్డి, లాలునాయక్, పద్మావతి, రాజేశ్వర్‌రెడ్డి, హన్మంత్, శ్రీధర్‌రెడ్డి, పద్మజరాణి, కిష్టారెడ్డి, శ్రీనివాస్, రవినాయక్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.