మంతన్‌గౌరెల్లిలో జీవాలపై హైనాల దాడి

ABN , First Publish Date - 2022-08-21T06:12:29+05:30 IST

మంతన్‌గౌరెల్లిలో జీవాలపై హైనాల దాడి

మంతన్‌గౌరెల్లిలో జీవాలపై హైనాల దాడి
హైనాల దాడిలో మృత్యువాతపడిన మేకల వద్ద కాపరి

యాచారం, ఆగస్టు 20: మండలంలోని సుల్తాన్‌పూర్‌, మంతన్‌గౌరెల్లి గ్రామాల్లో రెండు రోజులుగా హైనాల దాడిలో  గొర్రెలు, మేకలు మృత్యువాతపడుతున్నాయి. గురువారం అర్ధరాత్రి యాదయ్య, వెంకటయ్యలకు చెందిన 8 మేకలను, శుక్రవారం అర్ధరాత్రి సత్తయ్య, షకీలాకు చెందిన 4 మేకలను హైనాల దాడిలో మృత్యువాతపడ్డాయి. ఘటనాస్థలాలను రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులతో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులు పరిశీలించారు. పాదముద్రలను గుర్తించి హైనాల దాడిగా నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more