జీఈఎ్‌సటీకి భారీ స్పందన
ABN , First Publish Date - 2022-12-05T00:17:35+05:30 IST
మండల పరిధి ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా సంస్థలో అదివారం నిర్వహించిన గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్(జీఈఎ్‌సటీ)కు భారీ స్పందన వచ్చింది.
స్కాలర్‌షిప్ టెస్ట్‌కు హాజరైన 3వేల మంది విద్యార్థినులు
మొయినాబాద్ రూరల్, డిసెంబరు 4: మండల పరిధి ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా సంస్థలో అదివారం నిర్వహించిన గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్(జీఈఎ్‌సటీ)కు భారీ స్పందన వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పదో తరగతి పాసైన 3,000 మంది విద్యార్థినులు స్కాలర్‌షిప్ టెస్ట్ రాశారు. ఉదయం 10నుంచి 12గంటల వరకు, రెండో దఫా మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో 25 లోపు ర్యాంక్.. టాప్10లో నిలిచిన విద్యార్థినులకు ఇంటర్ కోర్సు పూర్తయ్యే వరకు నెలకు రూ.5వేల చొప్పున స్కాలర్‌షిప్, ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా సంస్థలో ఉచిత విద్య అందిస్తామని విద్యాసంస్థల డీన్ ఎంవీ.రామరావు తెలిపారు. అలాగే 15 టాప్ ర్యాంకు సాధించిన వారికి రూ.3వేల చొప్పున స్కాలర్‌షిప్ ఇస్తూ తమ కాలేజీల్లో ఉచితంగా ఇంటర్ బోధిస్తామని తెలిపారు. అదివారం నిర్వహించిన పరీక్షకు రెండు రాష్ట్రాల విద్యార్థినులు భారీగా హాజరయ్యారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా సంస్థలో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారని, అలాగే మరెంతో మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని రామారావు తెలిపారు. తమ విద్యా సంస్థలో నాణ్యమైన విద్య, విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు.