సేవా కార్యక్రమాలను అడ్డుకుంటే ఎలా?

ABN , First Publish Date - 2022-12-16T23:49:13+05:30 IST

పేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలను సైతం అధికారంలో ఉన్నామని అడ్డుకుంటే ఎలా అని పాలమూరు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.

సేవా కార్యక్రమాలను అడ్డుకుంటే ఎలా?
మాట్లాడుతున్న పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి

షాద్‌నగర్‌అర్బన్‌, డిసెంబరు 16: పేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలను సైతం అధికారంలో ఉన్నామని అడ్డుకుంటే ఎలా అని పాలమూరు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌, బీజేపీ సీనియర్‌ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. షాద్‌నగర్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కేశంపేట మండలంలోని కొత్తపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన 20మంది విద్యార్థులకు రూ.5వేల చొప్పున పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయగా ప్రిన్సిపాల్‌తో కార్యక్రమాన్ని రద్దు చేయించారని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తుంటే ఓర్వలేక ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - 2022-12-16T23:49:15+05:30 IST