మహనీయుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌

ABN , First Publish Date - 2022-08-07T05:38:07+05:30 IST

మహనీయుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌

మహనీయుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌
జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌

షాద్‌నగర్‌/కేశంపేట/నందిగామ/కొందుర్గు/కొత్తూర్‌/ఇబ్రహీంపట్నం/మంచాల/యాచారం/కందుకూరు/ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/మాడ్గుల/చేవెళ్ల/షాబాద్‌/శంషాబాద్‌, ఆగస్టు 6: తెలంగాణ రూపకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ మహనీయుడని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ కొనియాడారు. ఆచార్య జయశంకర్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గల జయశంకర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా నందిగామలోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈట గణేష్‌, కేశంపేటలో జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావన్‌రెడ్డి, కొందుర్గులో వైస్‌ ఎంపీపీ రాజే్‌షపటేల్‌ నివాళులర్పించారు. అదేవిధంగా కొత్తూర్‌లో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతసత్యనారాయణ, ఎంపీపీ పి.మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్యదేవేందర్‌యాదవ్‌, వైస్‌చైర్మన్‌ డోలీ రవీందర్‌, ఎంపీడీవో శరత్‌చంద్రబాబు, వ్యవసాయాధికారి గోపాల్‌ నివాళులర్పించారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో చౌరస్తాలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంచాలలో ఎంపీపీ నర్మదలచ్చిరాం, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీటీసీలు చీరాలరమేష్‌, కావలిశ్రీనివాస్‌, సర్పంచ్‌ జగన్‌రెడ్డి, ఆరుట్లలో సర్పంచ్‌ కొంగరవిష్ణువర్దన్‌రెడ్డి నివాళులర్పించారు. యాచారంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కొప్పు సుకన్యబాషా, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ ఎంపీడీవో విజయలక్ష్మి జయశంకర్‌ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. కందుకూరులోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీడీవో వెంకట్రాములు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల శాఖ అద్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆర్డీవో వెంకటాచారి, డిప్యూటీ తహసీల్దార్లు బి.సుదర్శన్‌రెడ్డిలు శ్రీధర్‌ వేడుకల్లో పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తహసీల్దార్‌ ఎస్‌.జ్యోతి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిపారు.  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి విజయలక్ష్మి, లక్ష్మీనర్సింహారెడ్డి, పాండుగౌడ్‌, దీక్షిత్‌రెడ్డి, కార్తీక్‌, నందీశ్వర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ అనితవిజయ్‌, జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌, వైస్‌ ఎంపీపీ జక్కు అనంతరెడ్డిలు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమనగల్లు మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో చైర్మన్‌ రాంపాల్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గయ్య, కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు. కడ్తాలలోని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కంబాల పరమేశ్‌ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిపారు. ఎంపీపీ కమ్లీ మోత్యనాయక్‌, సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, ఉపసర్పంచ్‌ కడారి రామకృష్ణ, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మనాయక్‌ పాల్గొన్నారు. తలకొండపల్లిలోని విఠాయిపల్లిలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి పాల్గొని జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాడ్గులలో రమే్‌షరెడ్డి, చలమంద, సుబాష్‌, జంగయ్య, పగడాల రవి, కృష్ణారెడ్డి, జంగయ్యగౌడ్‌లు నివాళులర్పించారు. అదేవిధంగా చేవెళ్లలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాజ్‌కుమార్‌, దేవునిఎర్రవల్లి సర్పంచ్‌ సామ మాణిక్యరెడ్డిలు జయశంకర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మొయినాబాద్‌లోని ఆయా గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. షాబాద్‌లోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట డిప్యూటీ తహసీల్దార్‌ క్రాంతికిరణ్‌ నివాళులర్పించారు. సీనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణయ్య, ఆర్‌ఐ కృష్ణ, జూనియర్‌అసిస్టెంట్‌ రాము, వీఆర్‌ఏలు, సిబ్బంది నర్సింహులు పాల్గొన్నారు. అదేవిధంగా శంషాబాద్‌లోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్‌, జడ్పీటీసీ నీరటితన్వీరాజు నివాళులర్పించారు. 

Read more