నిరుపేదలకు ఉన్నత విద్య గగనమే

ABN , First Publish Date - 2022-11-18T23:08:42+05:30 IST

నూతన విద్యావిధానాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో భవిష్యత్తులో నిరుపేదలకు ఉన్నత విద్య అందడం గగనమేనని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు.

నిరుపేదలకు ఉన్నత విద్య గగనమే
సదస్సులో మాట్లాడుతున్న నాగేశ్వర్‌

విద్యారంగంలో పెను మార్పులకు శ్రీకారం చుడుతున్న పాలకులు

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

యాచారం, నవంబరు 18: నూతన విద్యావిధానాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో భవిష్యత్తులో నిరుపేదలకు ఉన్నత విద్య అందడం గగనమేనని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. మాల్‌లో శుక్రవారం ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్లో ఎప్‌ఎఫ్‌ఐ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యారంగ ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయన్నారు. అందుకే డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయడం లేదని ఆరోపించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలల నిర్మాణానికీ ప్రభుత్వం నిధులివ్వడం లేదన్నారు. జాతీయ విద్యావిధానం విద్యారంగంలో అసమానతలు తేవడం ఖాయమన్నారు. ఇదే అమలైతే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్య గగనమే అవుతుందన్నారు. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రానికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. విద్య ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంద న్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేసేవరకు విద్యార్థులు ఉద్యమించాలన్నారు. త్వరలోనే ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహాసభలు ఉస్మానియా విశ్వవిద్యాల యంలో నిర్వహిస్తామని నాగేశ్వర్‌ తెలిపారు. సదస్సులో ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు జంగయ్య, రమేష్‌, తరంగ్‌, గణేష్‌. చందూనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-18T23:08:42+05:30 IST

Read more