విద్యతోనే ఉన్నత జీవితం
ABN , First Publish Date - 2022-12-15T23:53:21+05:30 IST
విద్యతోనే ఉన్నత జీవితం లభిస్తుందని తలకొండపల్లి జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు.
ఆమనగల్లు, డిసెంబరు 15: విద్యతోనే ఉన్నత జీవితం లభిస్తుందని తలకొండపల్లి జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. వెల్దండ ప్రభుత్వ పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడాదుస్తులను పంపిణీ చేశారు. 420 మంది విద్యార్థులకు వెంకటేశ్ క్రీడాదుస్తులు సమకూర్చి తలకొండపల్లి ఎంపీపీ నిర్మలశ్రీశైలం గౌడ్, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులతో కలిసి అందజేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 20వేల మంది విద్యార్థులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడా దుస్తులు సమకూర్చి అందజేసినట్లు వెంకటేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు గోపాల్‌నాయక్, శృతిలయ కల్చరల్ అకాడమి చైర్మన్ చిత్తరంజన్, నాయకులు లక్ష్మణ్ నాయక్, బుచ్చిబాబు, తిరుపతయ్యగౌడ్, జగన్, గణేశ్, రమేశ్, విజయేందర్, పాల్గొన్నారు.