ఆకతాయిల వేధింపులు.. యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-24T05:43:13+05:30 IST

ఆకతాయిల వేధింపులు.. యువతి ఆత్మహత్య

ఆకతాయిల వేధింపులు.. యువతి ఆత్మహత్య

శామీర్‌పేట, సెప్టెంబరు 23 :  ఆకతాయిల  వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన  మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా  శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.  గ్రామానికి చెందిన దావుల మమత (16 ) ఇంటర్మీడియట్‌ మధ్యలో మానేసి ఇంట్లోనే ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తూ మమతను వేధిస్తున్నారు. ఆకతాయిల వేధింపులు భరించలేక  యువతి మనస్తాపం చెంది శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో  గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.  సాయంత్రం మృతురాలి తండ్రి యాదగిరి ఇంటికొచ్చి చూసేసరికి గది తలుపులు పెట్టి ఉండగా వాటిని విరగ్గొట్టి చూశాడు. అప్పటికే మమత చనిపోయింది.   దీంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం  ఇవ్వగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహానికి పంచనామా చేసి పోస్టుమార్టం  కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Read more