ఘనంగా సర్దార్‌ పటేల్‌ వర్ధంతి

ABN , First Publish Date - 2022-12-15T23:59:35+05:30 IST

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వర్ధంతిని పురస్కరించుకొని మేడ్చల్‌ నాయకులు, తదితరులు నివాళులర్పించారు.

ఘనంగా సర్దార్‌ పటేల్‌ వర్ధంతి
సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వర్ధంతిని పురస్కరించుకొని మేడ్చల్‌ నాయకులు, తదితరులు నివాళులర్పించారు. ఈమేరకు గురువారం మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కిష్టాపూర్‌ అర్చన కాలనీలో సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రమేష్‌, కౌన్సిలర్‌ గణేష్‌, బీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌, అర్చన సేవా సమితి అధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:59:36+05:30 IST