ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-10-07T05:50:29+05:30 IST
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
తాండూరు రూరల్, అక్టోబరు 6 : విద్యుత్ స్తంభానికి ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తాండూరు రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. తాండూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం కుంచారం తాలూకా పరిధిలోని లక్ష్మీసాగర్‌కు చెందిన జిన్నారం అంజప్ప(28) గత రెండేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి తాండూరులో ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 9.30 గంటలకు ముందు తాండూరు-మంతట్టి రైల్వేస్టేషన్ల మధ్య గల కేఎం నెం.69/3 పోల్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు.