ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-15T00:21:11+05:30 IST

ఇబ్రహీంపట్నం మండలం సాహెబ్‌గూడలో బుధవారం ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 14: ఇబ్రహీంపట్నం మండలం సాహెబ్‌గూడలో బుధవారం ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. సీఐ రామకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెం దిన రాకేష్‌ చౌదరి(34) పదేళ్ల క్రితం కుటుంబంతో ఎల్బీనగర్‌కు వలస వచ్చి కిరాణ దుకాణం నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం కిరాణ దుకాణాన్ని మంగల్‌పల్లికి మార్చారు. బుధవారం హైదరాబాద్‌ వెళ్లి సామాను తెస్తానని బయలుదేరిన రాకేష్‌ పక్క గ్రామమైన సాహెబ్‌గూడలో చెట్టుకు ఉరేసుకున్నాడు. రాకే్‌షకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2022-12-15T00:21:12+05:30 IST