-
-
Home » Telangana » Rangareddy » Hand bags of women lawyers were stolen-MRGS-Telangana
-
మహిళా న్యాయవాదుల హ్యాండ్ బ్యాగులు చోరీ
ABN , First Publish Date - 2022-10-12T05:11:27+05:30 IST
మహిళా న్యాయవాదుల హ్యాండ్ బ్యాగులు చోరీ

మేడ్చల్ అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మేడ్చల్ కోర్టులో మహిళా న్యాయవాదుల హ్యాండ్ బ్యాగులను మంగళవారం గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు. కోర్టు ఆవరణలో ఒక చోట బ్యాగులు ఉంచిన న్యాయవాదులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా దొంగలు బ్యాగులను అపహరించుకుపోయారు. బ్యాగుల్లో నగదు, విలువైన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు ఉన్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఈ మేరకు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.