దుర్గామాతకు ఘనంగా పూజలు

ABN , First Publish Date - 2022-09-30T05:50:48+05:30 IST

దుర్గామాతకు ఘనంగా పూజలు

దుర్గామాతకు ఘనంగా పూజలు
ఘట్‌కేసర్‌ : గాయత్రీ ఆలయంలో అన్నపూర్ణాదేగా దర్శనమిచ్చిన అమ్మవారు

తాండూరు/ధారూరు/ఘట్‌కేసర్‌/శామీర్‌పేట/మోమిన్‌పేట్‌/కీసర/మేడ్చల్‌,సెప్టెంబరు 29 : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత ఘనంగా పూజలందుకుంటోంది. ఈమేరకు గురువారం తాండూరు పట్టణం బసవన్న కట్ట వద్ద దుర్గామాతను కౌన్సిలర్‌ రాఘవేందర్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు కౌన్సిలర్‌ను సన్మానించారు. ధారూరు వీరభద్రేశ్వర ఆలయంలో అమ్మవారు లలితా త్రిపురసుందరీదేవి ఆవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం పోసి, కుంకుమార్చన చేశారు. ఘట్‌కేసర్‌లోని గురుకుల్‌ మైదానంలో భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  దుర్గామాత మండపంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. విక్రాంత్‌రెడ్డి, శివప్రదీ్‌పరెడ్డి, సాయికృష్ణ, చంద్రశేఖర్‌, రవి, హరిప్రసాద్‌రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ గాయత్రీదేవి ఆలయంలో గాయత్రీ మాత అన్నపూర్ణాదేవీగా దర్శనమిచ్చింది. శామీర్‌పేటలోని శ్రీగాయత్రి మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి.

ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్‌ ఎస్‌విఎల్‌ఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో వేదబ్రహ్మణులు పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం అమ్మవారిని వనదుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మోమిన్‌పేట్‌ మండలం టేకులపల్లిలోని హనుమాన్‌ మందిరంలో భక్తులు గీతాపారాయణం పఠిస్తూ మహాయజ్ఞం నిర్వహించారు. దుర్గమాతకు ప్రత్యేక పూజలు చేశారు. బీరయ్య, నారాయణరెడ్డి, నగేశ్‌, సంగారెడ్డి, మోహన్‌రెడ్డి, గాల్‌రెడ్డి, నర్సిములు, బ్రహ్మనందరెడ్డి, నారాయణ, రాములు, లక్ష్మయ్య, మల్లేశం, బాల్‌రాజ్‌, గోవర్ధన్‌ తదితరులున్నారు. కీసరగుట్టలో దేవీశరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మేడ్చల్‌ తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని గడిమైసమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు.


Read more