ఓంశాంతి కేంద్రంలో ఘనంగా రక్షాబంధన్‌

ABN , First Publish Date - 2022-08-07T05:30:00+05:30 IST

ఓంశాంతి కేంద్రంలో ఘనంగా రక్షాబంధన్‌

ఓంశాంతి కేంద్రంలో ఘనంగా రక్షాబంధన్‌
ఓంశాంతి కేంద్రంలో నిర్వహించిన రక్షాబంధన్‌ వేడుకల్లో మాట్లాడుతున్న నిర్వాహకురాలు మధు అక్కయ్య

వికారాబాద్‌, ఆగస్టు 7  : ఆధ్యాత్మిక చింతన ద్వారా ప్రతి ఒక్కరూ భగవంతుడికి చేరువ కావచ్చని ఓంశాంతి కేంద్రం నిర్వాహకురాలు మధు అక్కయ్య అన్నారు. ఆదివారం ఓంశాంతి కేంద్రంలో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగవంతుడికి అందరూ సమానమేనని, ఎవరు తనపట్ల ఎక్కువ నమ్మకం కలిగి ఉంటారో.. వారికి ఎప్పుడూ అండగా ఉంటాడని అన్నారు. ఆధునిక యుగంలో మనిషి దైనందిన కార్యక్రమాల్లో రోజంతా బిజీగా గడిపేస్తున్నాడని, తన జన్మకు కారణమైన భగవంతుడిని, తల్లిదండ్రులను మరిచిపోతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిళ్లతో కొందరు భగవంతుడిని స్మరించుకునే సమయం కూడా తీసుకోవడం లేదన్నారు. రోజూ భగవంతుడిని స్మరించుకోవడం ద్వారా కొత్త శక్తిని పొందవచ్చని, ఇది అనుభవమైతేగానీ తెలియదని చెప్పారు. యోగ, ధ్యానం చేయడం ద్వారా భగవంతుడికి చేరువవుతామని, అందరూ యోగ, ధ్యానం సాధన చేయాలని తెలిపారు. రక్షాబంధన్‌ కట్టడం వల్ల మీకు నేను రక్ష అని భగవంతుడు మనలను ఆశీర్వదించినట్లుగా భావించాలని ఆమె చెప్పారు. అనంతరం మధు అక్కయ్య పలువురికి రాఖీలు కట్టి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పూడూరు సొసైటీ చైర్మన్‌ సతీ్‌షరెడ్డి, మునిసిపల్‌ కౌన్సిలర్‌ గోపాల్‌, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, సంతోష్‌ అన్నయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T05:30:00+05:30 IST