ఘనంగా మొహర్రం వేడుకలు

ABN , First Publish Date - 2022-08-10T05:44:18+05:30 IST

ఘనంగా మొహర్రం వేడుకలు

ఘనంగా మొహర్రం వేడుకలు
తలకొండపల్లి: వెల్జాల్‌ల్లో మొహర్రం వేడుకల్లో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌

ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/షాబాద్‌/ఇబ్రహీంపట్నం/చేవెళ్ల/యాచారం/కందుకూరు/మొయినాబాద్‌ రూరల్‌/మాడ్గుల/మొయినాబాద్‌ ఆగస్టు 9: త్యాగానికి ప్రతీక అయిన మొహర్రం వేడుకలను ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి మండల కేంద్రాలు, గ్రామాల్లో మంగళవారం  భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పీర్ల చావిడీల్లో పీర్లను దర్శించుకొని దట్టీలు సమర్పించారు. ఆమనగల్లు పరిధి సంకటోనిపల్లిలో వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తలకొండపల్లి మండలం వెల్జాల్‌, గట్టిప్పలపల్లి, జూలపల్లి గ్రామాల్లో వేడుకలను జరుపుకున్నారు. మాజీ ఎంపీపీ సి.ఎల్‌.శ్రీనివా్‌సయాదవ్‌, నాయకులు ముజ్బుర్‌ రహెమాన్‌, అజీజ్‌, నరేందర్‌, యాదయ్య, శ్రీకాంత్‌, రాజు, భాస్కర్‌, ఆంజనేయులు, ఖలీల్‌, పరంధాములు, రవి, సాయి, జంగయ్య పాల్గొన్నారు. కడ్తాల మండలం మక్తమాదారంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహ, సర్పంచ్‌ సులోచనసాయిలు, ఎంపీటీసీ మంజులచంద్రమౌళి పాల్గొన్నారు. కడ్తాలలో జడ్పీటీసీ దశరథ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ జి.శ్రీనివా్‌సరెడ్డి, ఉప సర్పంచ్‌ రామకృష్ణ, పరమేశ్‌, లాయక్‌అలీ, జహంగీర్‌అలీ, జహ ంగీర్‌ బాబ,వెంకటేశ్‌ పాల్గొన్నారు. షాబాద్‌, బొబ్బిలిగామ, నాగర్‌గూడ, మన్‌మర్రి, బోడంపహాడ్‌, రేగడి దోస్వాడ, సర్దార్‌నగర్‌, పోతుగ ల్‌, హైతాబాద్‌ గ్రామాలల్లో మొ హరం వేడుకలు జరుపుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో పీర్ల పండగ కార్యక్రమ ంలో పీసీసీ కార్యదర్శి రాంరెడ్డి, పం డాల శంకర్‌గౌడ్‌, ఎండీ ఖాసీం, రామ్‌సాగర్‌, కృష్ణ, ఐ లయ్య పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆలూర్‌, కౌకుంట్ల, ఉరెళ్ల, కిష్టపూర్‌, మల్కాపూర్‌, ము డిమ్యాల్‌, ఈర్లపల్లి గ్రామాల్లో పీర్లనే ఊరేగించారు. యాచారం మండల గ్రామాల్లో సాయంత్రం పీర్ల ఊరేగింపు ప్రారంభమైంది. కులమతాలకతీతంగా మొక్కు లు సమర్పించుకున్నారు. కందుకూరు మండలంలో పీర్ల పండుగ జరుపుకున్నారు. ముస్లింలు సాయంత్రం పీర్లకు ప్రార్థనలు నిర్వహించి గ్రామాల్లో ఊరేగింపుతో తరలించి నిమజ్జనం చేశారు. సులేమాన్‌, చోటాజానీ మాట్లాడారు. నిజవిశ్వాసం కోసం ప్రాణత్యాగం చేసిన మహ్మద్‌ ప్రవక్త మునిమనుమడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ను స్మరిస్తూ మొహర్రం జరుకుంటున్నట్లు తెలిపారు. అంజద్‌, ప్రకాశ్‌రెడ్డి, ఫయాజ్‌, షకీల, అఫ్జల్‌బేగ్‌, అలీఖాన్‌, బుర్హాన్‌, చోటు, షరీఫ్‌, ఖదీర్‌ పాల్గొన్నారు. మొయినాబాద్‌ మండలంలోని గ్రామాల్లో పీర్ల ను ఊరేగించారు. హిందువులు, ముస్లింలు పాల్గొ న్నారు. మసీదులను లైట్లతో అలంకరించారు. మాడ్గుల మండలంలోని అన్ని గ్రామాల్లో పీర్ల పండుగను నిర్వహించారు. వేడకల్లో రసూల్‌, జహంగీర్‌, బాబా, అబ్బా స్‌ అలీ, హుస్సేన్‌ పాల్గొన్నారు. మొయినాబాద్‌ మండలంలో మొహరం పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మొయినాబాద్‌, సురంగల్‌,  కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్‌, పెద్దమంగళారం, తోలుకట్టత గ్రామాల్లో కులమతాలకు అతీతంగా మొహరం ఉత్సవాల్లో పాల్లొన్నా రు. వర్షంలో సైతం ఉత్సవాలను జరిపారు. 

Read more