గౌడ కులస్థులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి

ABN , First Publish Date - 2022-12-26T23:27:44+05:30 IST

గౌడ కులస్థులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగాలని.. అందుకు తమవంతు కృషిచేస్తామని గౌడ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్యగౌడ్‌, రాములుగౌడ్‌ అన్నారు. సోమవారం తిర్మలాపూర్‌లో గౌడ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు.

గౌడ కులస్థులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి
తిర్మలాపూర్‌లో గౌడ సంఘ కమిటీతో మండల నాయకులు కృష్ణయ్యగౌడ్‌, రాములుగౌడ్‌

కులకచర్ల, డిసెంబరు 26: గౌడ కులస్థులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగాలని.. అందుకు తమవంతు కృషిచేస్తామని గౌడ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్యగౌడ్‌, రాములుగౌడ్‌ అన్నారు. సోమవారం తిర్మలాపూర్‌లో గౌడ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. తిర్మలాపూర్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎం.అంజిలయ్యగౌడ్‌, ప్రధాన కార్యదర్శి సి.రాజుగౌడ్‌, ఉపాధ్యక్షులు సి.వెంకటయ్యగౌడ్‌, వి.రాంచంద్రయ్యగౌడ్‌, కార్యదర్శులు రాజుగౌడ్‌, రాములుగౌడ్‌, కృష్ణయ్యగౌడ్‌, కోశాధికారిగా జి.అంజిలయ్యగౌడ్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గౌడ కులస్థులకు ప్రభుత్వం అన్ని రిజర్వేషన్లలో ప్రాధాన్యం కల్పించాలని తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు కొండయ్యగౌడ్‌, సత్యయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-26T23:27:45+05:30 IST