ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2022-12-16T23:58:43+05:30 IST
ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకోవాలని ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్ గుప్త కోరారు.
ఆమనగల్లు, డిసెంబరు 16: ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకోవాలని ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్ గుప్త కోరారు. పట్టణంలోని సింగిల్ విండో కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంప వెంకటేశ్ మాట్లాడారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. పాత బకాయిలు ఉన్న రైతులకు రుణంలో 50శాతం మాఫీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో సింగిల్ విండో వైస్‌చైర్మన్ సత్యం, డైరెక్టర్ జోగు వీరయ్య, సీఈవో దేవేందర్ పాల్గొన్నారు.