ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2022-12-16T23:46:04+05:30 IST
ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
చేవెళ్ల, డిసెంబరు 16: ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 21మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాదవ్‌రావు, తహసీల్దార్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సీనియర్ శేరి దర్శన్, యాదయ్యగౌడ్ ఉన్నారు.