ప్రభుత్వ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

ABN , First Publish Date - 2022-12-31T23:59:50+05:30 IST

ప్రజల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే తమకు శ్రీరామరక్షగా నిలుస్తాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు

పార్టీలో కార్యకర్తల చేరిక సందర్భంగా మంత్రి సబితారెడ్డి

కందుకూరు, డిసెంబరు 31: ప్రజల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే తమకు శ్రీరామరక్షగా నిలుస్తాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ముచ్చర్ల అనుబంధ ఊట్లపల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు శనివారం నగరంలో మంత్రి నివాసానికి చేరుకొని ఆమె సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. వారితో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకం ప్రతీ లబ్ధిదారుకు చేరవేసేలా కృషిచేస్తున్నట్లు చెప్పారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు తాను నిరంతరం పాటుపడుతున్నానన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో తమకు అండగా ఉంటాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలకు పార్టీ కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జయేందర్‌ ముదిరాజ్‌, సర్పంచ్‌ రాంచంద్రారెడ్డి, నాయకులు కృష్ణరాంభూపాల్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, వై.శ్రీనివాస్‌, బాలకృష్ణ, జిట్టా రాజేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కె.విఘ్నేశ్వర్‌రెడ్డి, నరసింహ, పొట్టి ఆనంద్‌, కె.సధానంద్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:59:50+05:30 IST

Read more