ప్రభుత్వ రుణాలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-07-07T05:30:00+05:30 IST

ప్రభుత్వ రుణాలను వినియోగించుకోవాలి

ప్రభుత్వ రుణాలను వినియోగించుకోవాలి
మాట్లాడుతున్న జడ్పీవై్‌సచైర్మన్‌ ఈటగణేష్‌

నందిగామ, జూలై 7: యువత రుణాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని జడ్పీవై్‌సచైర్మన్‌ ఈటగణేష్‌ అన్నారు. ప్రధానమంత్రి ఉపాధికల్పన పథకంపై గ్రామీణ పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలకేంద్రంలో గురువారం మండల పరిషత్‌ అధికారులకు, యువకులకు అవగాహన కల్పించారు. పీఎంఈజీపీ స్కీమ్‌లో భాగంగా బ్యాంకుల ద్వారా రుణాలు పొంది తయారీ రంగం, సేవా రంగాలకు సంబంధించి ప్రాజెక్టులను నిర్వహించాలని అధికారులు సూచించారు. తయారీ రంగానికి గరిష్ఠంగా రూ.50లక్షలు, సేవారంగానికి రూ.20లక్షలు రుణాలు పొందవచ్చని సూచించారు. ప్రభుత్వాలు అందిస్తున్న సహకారాలను వినియోగించుకొని యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జడ్పీవై్‌సచైర్మన్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాదయ్య, చందూనాయక్‌, బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, శివ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:30:00+05:30 IST