రైతాంగానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2022-12-15T23:53:14+05:30 IST

రైతాంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డీసీఎమ్మెస్‌ వైస్‌చైర్మన్‌ మధుకర్‌రెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌ చెరువు నుంచి గురువారం సాగునీటిని వదిలారు.

రైతాంగానికి ప్రభుత్వం పెద్దపీట

మూడుచింతలపల్లి, డిసెంబరు 15 : రైతాంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డీసీఎమ్మెస్‌ వైస్‌చైర్మన్‌ మధుకర్‌రెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌ చెరువు నుంచి గురువారం సాగునీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. రైతులు చెరువు నీటిని సద్వినియోగం చేసుకుని పంటలు పండించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్‌ చైర్మన్‌ ఐలయ్యయాదవ్‌, సర్పంచ్‌ సింగం ఆంజనేయులు, రైతుబంధు మండల కన్వీనర్‌ శ్యామల, నాయకులు గోపాల్‌, శ్రీనివా్‌సచారి, సత్యనారాయణ, డప్పు సురేశ్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:53:15+05:30 IST