మత్స్యకారులకు అండగా ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-16T23:53:27+05:30 IST

మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మొయినాబాద్‌ ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షురాలు మంజుల రవియాదవ్‌లు అన్నారు.

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
పెద్దచెరువులో చేప పిల్లలను వదులుతున్న ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్‌

మొయినాబాద్‌ రూరల్‌, డిసెంబరు 16: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మొయినాబాద్‌ ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షురాలు మంజుల రవియాదవ్‌లు అన్నారు. మండలంలోని చిలుకూరు, హిమయత్‌ నగర్‌ చెరువుల్లో శుక్రవారం ప్రభుత్వం ద్వారా వచ్చిన దాదాపు 3లక్షల చేపపిల్లలను వదిలారు. ఇప్పటివరకు మండలంలో 13 గ్రామాల్లో చేపపిల్లలను వదిలినట్లు తెలిపారు. ఎన్కేపల్లిలో మాలకుంటలోనూ సర్పంచ్‌ చందన చంద్రయ్య చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు మంజుల, స్వరూప ఆండ్ర్యూ, ఆయా గ్రామాల మత్స్యుకార్మికుల సంఘం నాయకులు శ్రీరాములు, యాదయ్య, కిరణ్‌, యాదగిరి, రమేష్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:53:28+05:30 IST