ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందాలి

ABN , First Publish Date - 2022-11-11T23:28:38+05:30 IST

ప్రతి ప్రభుత ్వ ఉద్యోగికీ బదిలీ సర్వసాధారణమని వారు ఏప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి మన్ననలు పొందాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందాలి
బదిలీ అయిన జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌ను సన్మానిస్తున్న కలెక్టర్‌ హరీశ్‌

మేడ్చల్‌ నవంబరు11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రతి ప్రభుత ్వ ఉద్యోగికీ బదిలీ సర్వసాధారణమని వారు ఏప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి మన్ననలు పొందాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించి ఇటీవల బదిలీపై వెళ్తున్న శ్యాంసన్‌ వీడ్కోలు సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌ మాట్లాడుతూ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన శ్యాంసన్‌ ప్రజా సమస్యలపై ప్రత్యేకచొరవ తీసుకునే వారని ప్రశంసించారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ప్రజల సమస్యలను తీర్చడంలో మంచి పేరు సంపాదించారని, ఆయన సేవలను కొనియాడారు. అనంతరం శ్యాంసన్‌ను పూలమాలలు, శాలువాలాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా అదనపు కలెక్టర్‌గా బాద్యతలు స్వీకరించిన అభిషేక్‌ అగస్త్యాను పూలబొకే అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌, జడ్పీ సీఈఓ దేవసహాయం, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T23:28:39+05:30 IST