సమస్యలు తెలుసుకునేందుకే ‘శుభోదయం’

ABN , First Publish Date - 2022-12-07T23:49:56+05:30 IST

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే తాను ‘శుభోధయం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు.

సమస్యలు తెలుసుకునేందుకే ‘శుభోదయం’

షాబాద్‌, డిసెంబరు 7: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే తాను ‘శుభోధయం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. బుధవారం సంకేపల్లిగూడ, శేరిగూడ గ్రామాల్లో పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకున్నారు. అప్పటికప్పుడు తీర్చగలిగే సమస్యలు పరిష్కరించి, మిగిలిన వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. జెడ్పీటీసీ అవినా్‌షరెడ్డి, ఎంపీపీ ప్రశాంతి, ఎంపీడీవో అనురాధ, ఎంపీవో హన్మంతరెడ్డి, ఏఈలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:49:57+05:30 IST