విద్యార్థులకు మంచి భోజనం అందజేయాలి

ABN , First Publish Date - 2022-12-16T23:27:06+05:30 IST

‘విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించండి. మీ నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు?’ అని ఎంపీపీ అనురాధరమేష్‌ ఏజన్సీ నిర్వాహకులకు మందలించారు.

విద్యార్థులకు మంచి భోజనం అందజేయాలి
మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్న ఎంపీపీ అనురాధ

పెద్దేముల్‌, డిసెంబరు 16: ‘విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించండి. మీ నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు?’ అని ఎంపీపీ అనురాధరమేష్‌ ఏజన్సీ నిర్వాహకులకు మందలించారు. భోజన తయారీ సమయంలో టీచర్లు తప్పక పర్యవేక్షించా లని సూచించారు. మంబాపూర్‌ జెడ్పీ పాఠశాలలో కొన్ని రోజుల క్రితం మిడ్‌మీల్‌ చేసిన కొందరు విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో వాంతి చేసుకున్నారు. దీంతో ఎంపీపీ శుక్రవారం స్కూలును సందర్శించి కిచెన్‌షెడ్‌ను పరిశీలించారు. వంట పాత్రలు శుభ్రంగా ఉండాలని వంట మహిళలకు సూచించారు. శుచి, శుభ్రత తప్పక పాటించాలన్నారు. రోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకో వాల్సిన బాధ్యత టీచర్లు, వంట వారిపై ఉందన్నారు. రోజూ రుచికరమైన భోజనాన్నే అంది ంచాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రేగొండి శ్రవణ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎస్‌.నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:27:07+05:30 IST