ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2022-10-07T05:45:58+05:30 IST
ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్, అక్టోబరు 6: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికులు వేర్వేరుగా విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు లోదుస్తుల్లో బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి కవర్‌లో పెట్టుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో అధికారులు తనిఖీలు చేస్తుండగా అతడి వద్ద 435గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ 22.4లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అదేవిధంగా ఓ ప్రయాణికురాలి వద్ద 865 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ 46.04లక్షలు ఉటుందని అధికారులు అంచనా వేశారు.