ఘనంగా సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణం
ABN , First Publish Date - 2022-08-04T05:52:26+05:30 IST
ఘనంగా సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణం
కీసర, ఆగస్టు 3 : శ్రీవల్లి దేవసేనసమేత శ్రీసుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణహోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణమాసోత్సంలో భాగంగా షష్టిని పురస్కరించుకొని బుధవారం గర్భాలయంలోని మూలవిరాట్‌కు శ్రీ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం ఆలయ మహామండపంలో స్వామివారి కల్యాణం జరిగింది. ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ.. ప్రత్యేక హోమం
ఘట్‌కేసర్, ఆగస్టు 3 : పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ పూజలు మూడవ రోజైన బుధవారం ఘనంగా జరిగాయి. స్థాపితాదేవతాపూజ, చండీహవణం, మహాస్నపనం, ఫల, పుష్ప, ధాన్య, శయ్యవాసం పూజలతో పాటు ప్రత్యేక హోమం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి దంపతులు, సత్తిరెడ్డి, యెట్టాల్‌రెడ్డి, నల్లవెల్లి శేఖర్ దంపతులు హోమం నిర్వహించారు. నేడు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి పూజలు ముగిస్తాయని పూజారులు తెలిపారు.