వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ

ABN , First Publish Date - 2022-12-06T23:54:14+05:30 IST

చేవెళ్ల పట్టణ కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆలయ ఆవరణలో మహాపడిపూజను వైభవంగా నిర్వహించారు.

వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
చేవెళ్ల: అయ్యప్ప పడిపూజలో స్వాములు

చేవెళ్ల/కడ్తాల్‌/నందిగామ, డిసెంబరు 6: చేవెళ్ల పట్టణ కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆలయ ఆవరణలో మహాపడిపూజను వైభవంగా నిర్వహించారు. ఉదయం 9గంటలకు చేవెళ్ల గ్రామం నుంచి అయ్యప్ప ఆలయం వరకు దాదాపు మూడు కిలో మీటర్ల వరకు అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహంతో భారీ శోభాయాత్ర నిర్వహించారు. గురుస్వామి సతీష్‌నాయర్‌ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజను భక్తిశ్రద్ధలతో జరిపారు. అయ్యప్పమాలధారులు ఆలపించిన అయ్యప్ప పాటలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. హకీం సంతోష్‌కుమార్‌, కె.సుదర్శన్‌ ఆద్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. పడిపూజకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.రత్నం, చేవెళ్ల ఎంపీపీ. ఎం.విజయలక్ష్మి, జడ్పీటీసీ ఎం. మాలతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మిట్ట వెంకటరంగారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకట్‌స్వామి, సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, శ్రీనివాస్‌గౌడ్‌, సిద్దేశ్వర్‌, వెంకట్‌రెడ్డి, బండారు శైలజ, బాల్‌రాజ్‌ హాజరయ్యారు. అదేవిధంగా కడ్తాల మండల కేంద్రంలోని శివాలయంలో డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌ ఆధ్వర్యంలో అయ్యప్ప ఇరుముడి మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. గురు స్వాములు చందర్‌ నాయర్‌, వినోద్‌ల సమక్షంలో గణపతి పూజ, అభిషేకం, పడిపూజ నిర్వహించారు. ఇరుముడులు ధరించిన అయ్యప్ప స్వాములు అనంతరం శబరిమలైకి తరలివెళ్లారు. ఇరుముడులు ధరించిన స్వాములను గంప వెంకటేశ్‌ సత్కరించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బీసీ వెంకటేశ్‌, గణేశ్‌, యాట నర్సింహ, అయ్యప్ప స్వాములు, రాజు, జగదీశ్వర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా నందిగామ మండలంలోని అయ్యప్ప ఆలయ నిర్మాణానికి ఎంపీపీ ప్రియాంక శివశంకర్‌గౌడ్‌ రూ.5లక్షల విరాళాన్ని మంగళవారం భక్తులకు అన్నదానం చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్‌గౌడ్‌, కుమార్‌గౌడ్‌, నర్సింలు, శ్రీకాంత్‌, సి.కృష్ణ, బి.జంగయ్య, మల్లేష్‌, రమేష్‌ పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో ఆనందం

కడ్తాల్‌: ఆధ్యాత్మిక చింతనతో ఆనందమయ జీవనాన్ని పొందవచ్చని కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు గ్రహీత దివంగత సూదిని జైపాల్‌రెడ్డి సతీమణి సూదిని లక్ష్మమ్మ అన్నారు. అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. కౌన్సిలర్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ చైర్మన్‌ లీలా లక్ష్మారెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యాట నర్సింహలతో కలిసి ఆమె ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శంకర్‌, నాయకులు లక్ష్మారెడ్డి, రామకృష్ణ, వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:54:15+05:30 IST